గూగుల్ లో తెగ వెతికారు : అభినందన్ ది ఏ కులం?

గూగుల్ లో తెగ వెతికారు : అభినందన్ ది  ఏ కులం?

న్యూఢిల్లీ: ‘మన వీరుడు సురక్షితంగా తిరిగి రావాలంటూ చిన్న, పెద్ద తేడా లేకుండా దేశమంతా ప్రార్థిస్తున్న సమయంలో కొందరు మాత్రం అభినందన్ కులం కోసం వెదికారు. ‘అభినందన్ క్యాస్ట్’, ‘అభినందన్ క్యాస్ట్ జైన్’, ‘ఈజ్ అభినందన్ వర్తమాన్ జైన్’, ‘వర్తమాన్ క్యాస్ట్ ఇన్ సౌత్ ఇండియా’, ‘అభినందన్ వర్తమాన్ వికీ క్యాస్ట్ ’ అంటూ గూగుల్‌‌లో తెగ వెదికారు.

ఇలా వెదికిన వారిలో గుజరాతీలదే తొలిస్థానం! తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల వారూ ఈ జాబితాలో ఉన్నారు. అసలు అభినందన్ పేరు సెర్చ్ చేయడం ఓకే. కానీ కులం కోసం ఎందుకు సెర్చ్ చేశారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.