తెలంగాణలో బీఎంఎస్ భారీ పెట్టుబడులు

తెలంగాణలో బీఎంఎస్ భారీ పెట్టుబడులు

అమెరికా కేంద్రంగా ఉన్న (బీఎంఎస్) బ్రిస్టల్ మేయర్స్​ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో సుమారు రూ.100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాదులో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో బీఎంఎస్ కంపెనీ రాష్ట్రంలో డ్రగ్ డెవలప్ మెంట్, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. దీంతో రానున్న మూడు సంవత్సరాలలో బీఎంఎస్ కంపెనీ సుమారు 1500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 

ప్రపంచంలోనే ప్రసిద్ధ టాప్ టెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో బీఎంఎస్ ఒకటని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా కొనియాడారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యం వారి కార్యకలాపాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాన్నట్టు తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రతిభాపాటవాలున్న యువకులు చాలా మంది ఉన్నారని, ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభ ఉందని చాటి చెప్పారు. రాష్ట్రంలో తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని బీఎంఎస్ కు కేటీఆ్ ఈ సందర్భందా విజ్ఞప్తి చేశారు. బీఎంఎస్ కంపెనీ త్వరలోనే తమ లక్ష్యాన్ని చేరుకొని మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న నమ్మకం ఉందనిని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశమని పిలుపునిచ్చారు.