
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ విజిలెన్స్ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం హోం శాఖ కార్యదర్శిగా ఉన్న జితేందర్‌కు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు విజిలెన్స్ డీజీగా ఉన్న రాజీవ్ రతన్ గుండెపోటుతో ఏప్రిల్‌లో చనిపోయారు. కాగా.. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న రొనాల్డ్ రాస్ ఈ నెల 23 వరకు విదేశాలకు వెళ్తున్నారు. దీంతో ఆమ్రపాలికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు.