సెకండ్​ ఏఎన్ఎంల వెయిటేజీ మార్కులు పెంపు

సెకండ్​ ఏఎన్ఎంల వెయిటేజీ మార్కులు పెంపు

హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ ఏఎన్ఎంలకు మల్టీపర్పస్​హెల్త్​అసిస్టెంట్​ రిక్రూట్​మెంట్​వెయిటేజీ మార్కులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. హెల్త్​ మినిస్టర్ ​హరీశ్​రావు ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. 
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 49 ఏళ్లకు పెంచారు. ఇప్పటికే నోటిఫై చేసిన 1,520 ఖాళీలకు అదనంగా 146 పోస్టులు గుర్తించామని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1,666 కు పెంచామని పేర్కొన్నారు. ఇంతకు ముందు రాత పరీక్షకు 80 పాయింట్లు, సీనియార్టీకి 20 పాయింట్ల వెయిటేజీ ఉండగా దానిని రాత పరీక్షకు 70 పాయింట్లు, స్వరీస్​సీనియార్టీకి 30 పాయింట్లుగా సవరించారు.
 షెడ్యూల్డ్​ఏరియాల్లో పనిచేసేవారికి ప్రతి ఆరు నెలలకు 2.5 పాయింట్లు, ఇతర ప్రాంతాల్లో పని చేసేవారికి ఆరు నెలలకు రెండు పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు.