- ఆగస్టు నుంచి ప్రతినెలా చెల్లిస్తున్న ప్రభుత్వం
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.713 కోట్లను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. డిసెంబర్ నెల బిల్లులను బుధవారం విడుదల చేశారు. విడుదల చేసిన బిల్లుల్లో ఉద్యోగుల గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్స్ లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.713 కోట్లను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించిన బిల్లులను బుధవారం విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు మాసం నుంచి ప్రతినెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తున్నది. విడుదల చేసిన బిల్లులో ఉద్యోగుల గ్రాట్యూటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్స్ లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
