బడ్జెట్ అప్‌డేట్స్: ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌‌డీఐల పరిమితి పెంపు

బడ్జెట్ అప్‌డేట్స్: ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌‌డీఐల పరిమితి పెంపు

న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త బడ్జెట్‌‌లో ఈ మేరకు ఎఫ్‌‌డీఐల పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేశారు. బీమా కంపెనీల్లో ఎఫ్‌‌డీఐల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఈ రంగంలో మరిన్ని మార్పులకు బడ్జెట్‌‌లో కేంద్రం శ్రీకారం చుట్టింది.

విదేశీ కంపెనీలకు సైతం ఇన్సూరెన్స్ ఓనర్‌‌షిప్ దక్కేలా మార్పులు తీసుకొచ్చింది. అయితే లాభాల్లో భారత కంపెనీలకు సముచిత వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్థిక సంస్థల అభివృద్ధికి రూ.20 వేల కోట్లు కేటాయించింది. మంచి ఆర్థిక వ్యవస్థ కోసం బ్యాడ్ బ్యాంక్‌‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి బ్యాంకుల ఎన్‌‌పీఏలను బ్యాడ్ బ్యాంకులు నిర్వహించనున్నాయి.