దక్షిణ తెలంగాణను ప్రభుత్వం ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తోంది

దక్షిణ తెలంగాణను ప్రభుత్వం ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తోంది

ఉద్యోగాలు, నీళ్లను తాకట్టు పెట్టి ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పాలమూరులో స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్ ను పరిశీలించారు. ఎంపీగా ఉన్న సమయంలో.. పాలమూరును అద్భుతంగా తయారు చేస్తానన్న కేసీఆర్, ఇవాళ దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డి పాడు విస్తరణ, రాయలసీమ లిఫ్టుతో ఏపీ ప్రభుత్వం 11 టీఎంసీలు అధికంగా నీళ్లు తీసుకుని వెళ్లేలా వెసులుబాటు కల్పించిన దుర్మార్గుడు కేసీఆర్ అన్నారు. నీళ్ల పరిరక్షణ కోసం కృష్ణా పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేస్తామన్నారు భట్టి.