కుత్బుల్లాపూర్, వెలుగు: కుత్బుల్లాపూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్లు, నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అక్కడ ఉంటున్నవారు అడ్డుపడడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు వచ్చి వారిని అక్కడి నుంచి తరలించారు. గాజులరామారం సర్వే నంబర్49లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొందరు స్థానిక నాయకులు, కబ్జాదారులు నిరుపేదలకు అమ్మారు.
మరికొందరు కబ్జాదారులు ఏకంగా కమర్షియల్నిర్మాణాలు చేపట్టి, రెంట్‌కు ఇచ్చారు. ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ఆదేశాల మేరకు అధికారులు సోమవారం పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. 40కి పైగా అక్రమ నిర్మాణాలను తొలగించామని డిప్యూటీ తహసీల్దార్సుధాకర్ తెలిపారు. ఇదే సర్వే నంబర్లో ఇంకా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని సైతం కూల్చివేయాలని స్థానికులు కోరారు.
