హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను ఓటీఎస్ ద్వారా చెల్లించేందుకు సిద్ధమైన ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. బకాయిలను ఏడాదిలోగా విడతల వారీగా చెల్లించేలా ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. దీనిపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు కార్పొరేషన్ల పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు రూ.1,686.39 ఉండగా, వడ్డీ రూ.4,178.53 ఉంది. మొత్తం కలిపితే రూ. 5,864.92 కోట్లు అవుతోంది. ఇందులో వందశాతం వడ్డీ మాఫీతో రూ.1,686.39 చెల్లించనున్నది. జీహెచ్ఎంసీ రూ.1585.41కోట్లు, సీఎంసీ రూ.24.87 కోట్లు, ఎంఎంసీ రూ. 76.11 కోట్లు కట్టనున్నది.
