- ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం తెలంగాణ భవన్ లో విప్ విజయరమణారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై తేజస్వి విషం చిమ్మారని ఆరోపించారు.
తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చడం దుర్మార్గమని, ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర సమాజం ఖండిస్తోందని చెప్పారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటును అనుక్షణం వ్యతిరేకించే బీజేపీకి తెలంగాణలో పుట్టగతులుండని హెచ్చరించారు.

