రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలి: గవర్నర్ తమిళిసై

రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయాలి: గవర్నర్ తమిళిసై

ప్రధాని మోడీ ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంతో మంది పేదలకు ఈ పథకంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కీర్తి రెడ్డి ఫౌండేషన్ వారి ఆద్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ బోరబండలో ఫ్రీ మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై.. ప్రజాసేవ విషయంలో నాయకులు రాజకీయాలకు అతీతంగా వ్యవహారించాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు హాజరు కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాలంటే.. ముందుగా సంపూర్ణ ఆరోగ్యం అవసరమని ఆమె తెలిపారు. 

ఈ క్యాంపులో జనరిక్ మందులను చాలా తక్కువ ధరకు అందిస్తున్నారని తమిళిసై చెప్పారు. సాధారణ మెడికల్ షాపుల్లో మందుల ధరలు చూసి రోగుల ఆరోగ్యం మరింత పాడవుతుందన్నారు. వంశ పారపర్యంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పూర్తిగా బాడీ చెకప్ చేయించుకోవాలన్నారు.