సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ

సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ

లోక్ సభ ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీల కార్లు కూడా తనిఖీలు చేస్తున్నారు.  లేటెస్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ను  తనిఖీలు చేశారు ఎన్నికల ప్రత్యేక అధికారులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , ఖమ్మం, మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఎన్నికల ప్రచారం చేశారు.  కొత్తగూడెం జన జాతర సభకు వచ్చిన   రేవంత్ రెడ్డి  హెలికాప్టర్ ను ఎన్నికల ప్రత్యేక అధికారులు, ప్లయింగ్ స్కాడ్ బృందం  తనిఖీ చేశారు. 

మే 8 వతేదిలోపు రైతు భరోసా పూర్తి

 కొత్తగూడెం సభలో మాట్లాడిన రేవంత్.. మే 8వ తేదీ నాటికి రైతుభరోసా పూర్తి చేస్తామని  చెప్పారు. మొత్తం 69 మంది లక్షల రైతుల్లో ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో పంటసాయం డబ్బులు జమ చేశామని, నాలుగు లక్షల మందికీ ఈ నెల 8 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు. 9వ తేదీనాడు కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.