V6 News

గవర్నర్ తమిళిసై నల్గొండ పర్యటన వాయిదా

 గవర్నర్ తమిళిసై నల్గొండ పర్యటన వాయిదా

తెలంగాణ గవర్నర్ తమిళిసై నల్గొండ పర్యటన వాయిదా పడింది.  2023 మే 22 సోమవారం రోజున ఆమె నల్గొండ జిల్లాలోని  చందంపేట మండల,  గువ్వాలగుట్టకు వెళ్లాల్సి ఉంది. అక్కడ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని గవర్నర్ పరామర్శించాలనుకున్నారు. 

ముందస్తు షెడ్యూల్ ప్రకారం  గవర్నర్ మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొనాలి.  అనంతరం  గువ్వలగుట్టకు చేరుకోవాలి. గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారితో, గ్రామస్థులతో సమావేశమై సహపంక్తి భోజనం చేయాలి.  

కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ పర్యటన వాయిదా పడింది.  ఈ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.