
ఉద్యోగం రాదేమోనన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో కండక్టర్ నీరజ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఎక్స్ గ్రేషియాగా ఏడున్నర లక్షల రూపాయలు, అర్హతను బట్టి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. నీరజ కుటుంబానికి మూడు ఎకరాల భూమి కూడా ఇస్తామని ప్రకటించింది. అధికారులు రాత పూర్వకంగా ప్రభుత్వ హామీలను నీరజ కుటుంబానికి తెలిపారు.