National Car Racing Championship : రేసింగ్లో విషాదం

National Car Racing Championship : రేసింగ్లో విషాదం

చెన్నైలో అట్టహాసంగా జరుగుతున్న నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ లో విషాధం నెలకొంది. రెండో రౌండ్ పోటీల్లో కారు ప్రమాదానికి గురై ప్రముఖ రేసర్ కేఈ కుమార్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం జరిగిన సెలూన్ కార్ రేసింగ్ లో ఈ సంఘటన జరిగింది. కుమార్ నడుపుతున్న కారు అదుపు తప్పి మరొక కార్ ని ఢీ కొట్టింది. దాంతో కుమార్ కార్ పల్టీలు కొట్టి కంచెలోకి దూసుకెళ్లింది. 

యాక్సిండెంట్ లో తీవ్ర గాయాలపాలైన కుమార్ ను నిర్వాహకులు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కుమార్ మృతి వార్త తెలియగానే రేసింగ్ చైర్మన్ విక్కీ చందోక్ అతని గౌరవార్థంగా మిగతా రేసులను రద్దు చేశారు.