V6 News

ఆ షాట్ కొట్టాలంటే ఎంతో దమ్ముండాలె

ఆ షాట్ కొట్టాలంటే ఎంతో దమ్ముండాలె

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. పక్కా ప్లానింగ్‌‌తో బరిలోకి దిగిన ఇంగ్లీష్ పేసర్లు టీమిండియా బ్యాట్స్‌‌మెన్‌‌ పనిపట్టారు. ఆ తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌‌మెన్ కూడా దీటుగా బ్యాటింగ్ చేసి 8 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్‌‌లో భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ ఒక్కడే బ్యాటింగ్‌‌లో రాణించాడు. వీర ఫామ్‌‌లో ఉన్న యంగ్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఒకట్రెండు మెరుపు షాట్లతో సత్తా చాటాడు. కానీ కుదురుకున్నట్లుగా కనిపించినా త్వరగానే వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో పంత్ కొట్టిన ఓ షాట్ చర్చనీయాంశంగా మారింది. 

స్పీడ్‌‌స్టర్ ఆర్చర్ బౌలింగ్‌‌లో అత్యంత వేగంగా దూసుకొచ్చిన బంతికి పంత్ కొట్టిన రివర్స్ స్వీప్ సిక్స్ వెళ్లింది. క్రికెట్ వర్గాల్లో ఈ షాట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పంత్ షాట్ క్రికెట్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ అని ఇంగ్లండ్ బ్యాటింగ్ గ్రేట్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. 90 మైళ్ల వేగంతో వచ్చిన బంతిని రివర్స్ స్వీప్‌లో సిక్స్ కొట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. పంత్ షాట్ అద్భుతం అని టీమిండియా దిగ్గజం గౌతం గంభీర్ అన్నాడు. ఆ షాట్ ఆడాలంటే ఎంతో దమ్ము ఉండాలన్నాడు.