పెండింగ్​ నిధులు విడుదల చెయ్యండి : జీఆర్ఎంబీ

పెండింగ్​ నిధులు విడుదల చెయ్యండి : జీఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: జీఆర్ఎంబీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పెండింగ్ నిధులను వెంటనే విడుదల చే యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బోర్డు కోరింది. నిరుడు జనవరి 3న నిర్వహించిన 14వ బోర్డు మీటింగ్​లో రూ.16 కోట్ల నిధులకు ఆమోదం తెలిపామని చెప్పింది. తెలంగాణ తన వాటాగా కేవలం రూ.5.27 కోట్ల నిధులే చెల్లించిందని మంగళవారం విడుదల చేసిన లెటర్ లో స్పష్టం చేసింది. మిగతా రూ.4.77 కోట్ల కోసం అప్పటి ప్రభుత్వానికి లేఖలు రాసినా విడుదల చేయలేదని వెల్లడించింది.