ఫ్రెండ్‌‌షిప్‌‌ కోసం గుండు చేసుకున్నరు

ఫ్రెండ్‌‌షిప్‌‌ కోసం గుండు చేసుకున్నరు

కొంత కాలంగా క్యాన్సర్‌‌‌‌తో బాధపడుతూ  ట్రీట్మెంట్‌‌ తీసుకుంటున్నాడు అల్విస్‌‌. ఒక పక్క ట్రీట్మెంట్‌‌ నడుస్తోంది. కానీ, తనలో ధైర్యం రోజురోజుకూ తగ్గుతోంది. ‘నేను క్యాన్సర్‌‌‌‌ నుండి కోలుకొని బతుకుతానా’ అని ఆలోచించేవాడు.  కీమో థెరపీ వల్ల తన జుట్టంతా ఊడిపోయింది. ఇక అప్పటినుండి బయటికెళ్లడమే మానేశాడు. 
కారణం తెలుసుకున్న అల్విస్ స్నేహితులు తనలో మనోధైర్యాన్ని నింపాలనుకున్నారు. దాదాపు 12 మంది ఫ్రెండ్స్‌‌ వాళ్లకు వాళ్లే గుండు చేసుకున్నారు. తరువాత​ అల్విస్‌‌ ఇంటికి వెళ్లి డాన్స్‌‌లు చేస్తూ ‘నీకేం కాదు. తోడుగా మేమంతా ఉన్నాం’ అని చెప్పారు తనకు. ట్రిమ్మర్‌‌‌‌తో వాళ్లకు వాళ్లే గుండు చేసుకుంటూ, డాన్స్‌‌లు చేస్తూ, అల్లరి చేసిన వీడియోను ‘గుడ్‌‌ న్యూస్‌‌ కరస్పాండెంట్‌‌’ అనే ఇన్‌‌స్టాగ్రామ్ పేజ్‌‌ పోస్ట్ చేసింది. వీడియో కింద ‘నో వన్‌‌ ఫైట్స్‌‌ ఎలోన్‌‌’ అని క్యాప్షన్‌‌ పెట్టారు. ఆ వీడియో పెట్టిన కొన్ని గంటల్లోనే 3 లక్షల వ్యూస్, 2 లక్షల లైక్స్‌‌ వచ్చాయి.