దేశంలో విస్తరించేందుకు గుఫిక్‌‌ ప్లాన్స్‌‌

దేశంలో విస్తరించేందుకు గుఫిక్‌‌ ప్లాన్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గుఫిక్‌‌  బయోసైన్సెస్‌‌ దేశ మార్కెట్‌‌లో విస్తరించాలని చూస్తోంది.  లైయోఫిజ్డ్‌‌ యాంటిబయోటిక్స్‌‌, యాంటిఫంగల్‌‌ (ఒక రకమైన డ్రగ్స్ స్టోరేజ్ విధానం) మార్కెట్‌‌లో రూ. 3,000 కోట్ల విలువైన వాటాను అందుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఇనొవేటివ్ ప్రొడక్ట్‌‌లను తీసుకొచ్చే ఈ కంపెనీ, హెర్బల్‌‌ ప్రొడక్ట్స్‌‌తో పాటు వివిధ  ఏపీఐలను తీసుకొచ్చి దేశంలో విస్తరించాలని చూస్తోంది. కంపెనీ కిందటి వారం మెడిసిన్స్‌‌ను  డెలివరీ చేయడానికి ‘డ్యూయల్ ఛాంబర్ బ్యాగ్స్‌‌’ సిస్టమ్‌‌ను  కూడా లాంచ్ చేసింది.