నడిరోడ్డుపై కర్రలతో కొట్టుకున్న ABVP, NSUI కార్యకర్తలు

నడిరోడ్డుపై కర్రలతో కొట్టుకున్న ABVP, NSUI కార్యకర్తలు

JNU ఘటనకు నిరసనగా అహ్మదాబాద్ లో NSUI చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  ఏబీవీపీ , NSUI విద్యార్ధి కార్యకర్తలు కొట్టుకున్నారు. నడిరోడ్డుపైనే కర్రలతో దాడి చేసుకున్నారు. అహ్మ‌దాబాద్‌లోని ఏబీవీపీ ఆఫీసు వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఢిల్లీలోని జేఎన్‌యూలో జ‌రిగిన విధ్వంసానికి నిర‌స‌న‌గా NSUI కార్య‌క‌ర్త‌లు ABVP ఆఫీసు ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. దీంతో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ఈ ఘర్షణలో సుమారు ప‌ది మంది గాయ‌ప‌డ్డారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదర గొట్టారు.

NSUI జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్ ఈ ఘటనను ఖండించారు. “బీజేపీ ప్రభుత్వం యొక్క నిరంకుశ ప్రవర్తన ఫలితంగానే ఈ దాడి జరిగిందని” ఆరోపించారు. ఈ ప్రభుత్వం నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని,  రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆయన అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దాడిని ఖండించింది, నేరస్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. “ABVP గూండాలు చేసిన ఈ దుర్మార్గపు చర్య,  వారి హింసాత్మక ధోరణులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ఈ ఉగ్రవాద చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం,  నేరస్తులపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ” అని పార్టీ ట్వీట్ చేసింది.