V6 News

10 వేల కాయిన్స్ తో నామినేషన్ వేసిన కూలి

10 వేల కాయిన్స్ తో  నామినేషన్ వేసిన కూలి

గుజరాత్ లోని గాంధీనగర్  నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహేంద్రభాయ్ పత్నీ నామినేషన్ వేశాడు. డిపాజిట్ కింద రెండు సంచుల్లో నింపిన 10 వేల రూపాయి కాయిన్స్ ను ఎన్నికల అధికారులకు అందజేశాడు. గాంధీ నగర్ మహాత్మా మందిర్ దగ్గర్లోని స్లమ్ లో తను నివాసం ఉండేవాడినని, 2010 అక్కడ దండి కుటీర్ మ్యూజియం నిర్మాణం కోసం తమ ఇండ్లను కూల్చివేసి, ఖాళీ చేయించారని చెప్పాడు.

మొత్తం 521 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నాడు. తమవాళ్లందరికీ న్యాయం కావాలని.. అందుకే తమ ప్రతినిధిగా తనను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారని చెప్పాడు. తనకు మద్దతు ఇవ్వాలనుకుంటున్న వారందరి నుంచి ఒక్కో రూపాయి విరాళంగా సేకరించానని..ఆ మొత్తాన్ని డిపాజిట్ చెల్లించేందుకు తీసుకొచ్చా’అని మహేంద్ర పత్నీ చెప్పారు.