గులాబ్‌జామ్ తెలుసా…? తెలుసానా.. నోట్లో వేసుకుంటే కరిగిపోదూ తియ్యగా అంటారు కదా! కానీ, ఈ గులాబ్‌జామ్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఎందుకో తెలుసా? ఇది స్వీట్ స్వీట్ గులాబ్‌జామ్ కాదు కాబట్టి.. హాట్ హాట్ గులాబ్‌జామ్ కూర. ఊరుకోండి.. గులాబ్‌జామ్‌తో ఎవరైనా కూర చేస్తారా అని అనకండి. ఎందుకంటే ఇది నిజంగా గులాబ్‌జామ్ కూర నిజం కాబట్టి. ఇప్పుడు ట్విట్టర్లో దీనిపైనే చర్చ మొదలుపెట్టారు మన నెటిజన్లు.
హర్ష్ మిట్టల్ అనే ఓ వ్యక్తి ఆ కూరకు సంబంధించిన ఫొటో షేర్ చేసి ‘‘రోజురోజూ నాలో మానవత్వంపై నమ్మకం పోతోంది” అంటూ ట్వీట్ చేశాడు. దీంతో కొందరు కామెంట్ల మీద కామెంట్లు చేశారు. ఉంది అని కొందరంటే లేనే లేదంటూ మరికొందరు వాదనలకు దిగారు. రాజస్థాన్‌లో దీన్ని బాగా వండుతారని, మస్తు టేస్ట్ ఉంటుందని ఓ యూజర్ కామెంట్ చేసింది. ఇంకో యూజర్ అయితే, గులాబ్‌జామ్ ఏంటి, రస్మలాయ్తోనూ కూర చేసేస్తారు తెలుసా అంటూ కామెంట్ చేశాడు. జోధ్‌పూర్‌లో ఆ రెండూ చాలా ఫేమస్ అన్నాడు. నెయ్యితో, కారం కారంగా భలే మజా వస్తుందని చెప్పాడు. కొందరు యూజర్లు గుండె నొప్పితో చావాల్సిందేనంటూ కామెంట్లు పెట్టారు.
