సిద్దిపేట జిల్లాలో కాల్పుల మోత

సిద్దిపేట జిల్లాలో కాల్పుల మోత

సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాల్పుల కలకలం సృష్టించింది. రెండు కుంటుంబాల మధ్య జరిగిన చిన్న గొడవ కాల్పులకు దారితీసింది. దేవుని సదానందం అనే యువకుడు పక్కింటివారిపై ఏకే47 గన్ తో కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పింది. కాల్పులతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. యువకుడికి ఏకే-47 గన్ ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. సదానందం కోసం పోలీసులు గాలిస్తున్నారు. సదానందం కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

see more news

జగిత్యాలలో దారుణం..8 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

వెనక నుంచి వచ్చి ముద్దు పెట్టి పారిపోవడమే అతడి పని