
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, తమన్నా భాటియాలు నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల తేదీని ఖరారు చేశారు. నాగ శేఖర్ తెరకెక్కిస్తున్న సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రతొక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో సినిమాను రూపొందించారు. నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబులు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు.
క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్‌గా మారుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టాలెంటెడ్ హీరో సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.
నటీనటులు : సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి తదితరులు నటించారు.
టెక్నికల్ టీం : స్కీన్ ప్లే, డైరెక్షన్ - నాగశేఖర్. బ్యానర్ - నాగశేఖర్ మూవీస్, సమర్పకులు - ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు. నిర్మాతలు - భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి. పబ్లిసిటీ డిజైనర్స్ - అనిల్, భాను. కొరియోగ్రఫి - వీజేశేఖర్. లైన్ ప్రొడ్యూసర్స్ - సంపత్, శివ ఎస్. యశోదర. ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్ - నవీన్ రెడ్డి. డైలాగ్స్ - లక్ష్మీ భూపాల్. మ్యూజిక్ - కాలభైరవ. ఎడిటిర్ - కోటగిరి వెంకటేశ్వరరావు. సినిమాటోగ్రాఫర్ - సత్య హెగ్డే. స్టంట్స్ - వెంకట్. PRO - ఏలూరు శ్రీను, మేఘశ్యామ్.