- పిడుగులు పడి నాలుగు పశువులు మృతి
చేవెళ్ల, వెలుగు : చేవెళ్ల మున్సిపాలిటీ, మండల పరిధిలో సోమవారం రాత్రి వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు కూడా తోడు కావడంతో కూరగాయల పంటలు తీవ్ర నష్టం జరిగింది. మామిడి కాయలు నేలరాలాయి. చన్వెల్లి గ్రామానికి చెందిన రైతులు భుజంగరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తిరుపతిరెడ్డికు చెందిన బీర, కాకర పంటలు దెబ్బతిన్నాయి.
ఓ రైతుకు చెందిన పాలీహౌస్ నేలకూలింది. పిడుగులు పడడంతో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని వడ్డె జంగయ్యకు చెందిన రెండు ఎడ్లు, ఒక ఆవు, పామెనలో గోల్కొండ వెంకటేశ్‌కు చెందిన ఆవు మృతి చెందాయి. రాత్రి 12 గంటల నుంచి తెల్లారే వరకు పామెన, ఉరెళ్ల, కేసారం, ఎర్రోనికొటాల, తంగేడుపల్లి, అంతారం, నాంచేరు తదితర గ్రామాలకు కరెంట సప్లై నిలిచిపోయింది.

