- ప్రతిభ చూపిన నగరవాసులు
గచ్చిబౌలి/గండిపేట, వెలుగు : గచ్చిబౌలిలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గంటపాటు నాన్స్టాప్కీ బోర్డ్ వాయించే కార్యక్రమం నిర్వహించగా, ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి 2,000 మంది కీబోర్డ్ కళాకారులు పాల్గొన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులకు గిన్నిస్ రికార్డుకు ఎంపిక చేశారు.
అందులో హల్లెల్మ్యూజిక్స్కూల్లో కీ బోర్డ్ నేర్చుకుంటున్న గచ్చిబౌలికి చెందిన డాక్టర్ తాతపూడి హిమ కిరణ్ పాల్ , తాతపూడి సుధా సుహాసిని పాల్ ఉన్నారు. అలాగే, మణికొండలోని పబ్బితి ప్రవాంత్, తబిత దంపతుల ఏడేండ్ల కొడుకు జోసెఫ్ ప్రిన్స్ కూడా ఈ రికార్డు సాధించిన వారిలో ఉన్నాడు. దీనికి సంబంధించి సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు పాస్టర్ అగస్టిన్ దాండింగి సర్టిఫికెట్లను అందజేశారు.
