Hanuma Vihari: సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి

Hanuma Vihari: సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి

రంజీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్ జట్టు విహారి నేత్రుత్వంలో వరుస విజయాలు నమోదు చేసి జోరు కొనసాగిస్తుంది. మధ్యప్రదేశ్ తో మొదలైన క్వార్టర్ ఫైనల్ లోనూ అదే ఆటతీరును కనబరుస్తుంది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఆఖర్లో విహారి వీరోచితపోరాటం కనబరిచాడు. తొలిరోజు బ్యాటింగ్ కు వచ్చిన విహారి అవేశ్ ఖాన్ వేసిన బాల్ కి గాయపడ్డాడు. మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు.

అయితే, రెండో రోజు సెంచరీల హీరోలు కరణ్ షిండే, రికీ భుయ్ ఔట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. కేవలం 30 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టీం స్కోర్  353/9 ఉన్న టైంలో గాయాన్ని లెక్క చేయని విహారి, క్రీజ్ లోకి వచ్చాడు. ఎడమ చేతితో బ్యాటింగ్ పట్టాడు. కొన్ని కొన్ని సార్లు ఒంటి చేత్తో బంతుల్ని ఎదుర్కున్నాడు. ఈ పోరాటాన్ని చూసినవాళ్లంతా తమకు గతంలో సిడ్నీ టెస్టులో చేసిన పోరాటం మళ్లీ గుర్తొచ్చిందని అన్నారు.