Hanuman Movie: హనుమాన్ మరో రికార్డ్..300 సెంటర్స్‌లో 30డేస్

Hanuman Movie: హనుమాన్ మరో రికార్డ్..300 సెంటర్స్‌లో 30డేస్

ఈ సంవత్సరం(2024) సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపిన చిత్రం ఎదైనా ఉందంటే..టక్కున గురొచ్చేది ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్(HanuMan).ఈ మూవీ దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. సంక్రాంతి బరిలో త్రీవ్రమైన పోటిని ఎదుర్కోని..బ్లాక్ బస్టర్‌‌గా నిలిచింది.ఇప్పటికీ..ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు గడిచిన ఇంకా డీసెంట్ కలెక్షన్స్ రాబడుతునే ఉంది.

లేటెస్ట్గా హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇవి చాలవు అన్నట్టుగా..మరో రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకుంది. ఆ రికార్డ్ ఏంటంటే ఈ సినిమా అన్ని ఎరియాలను కలుపుకోని 300 సెంటర్స్‌ లో 30డేస్ కంప్లీట్ చేసుకోన్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ హీరోలకి కూడా సాధ్యం కాని రికార్డ్ సెట్ చేసింది హనుమాన్ మూవీ.  

also read : క్రైమ్ థ్రిల్లర్తో రానున్న సత్యదేవ్..డైరెక్టర్ ఎవరంటే?

ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే..రూ.40 కోట్ల బడ్జెట్‌తో డైరక్టర్ ప్రశాంత్ వర్మ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అంతేకాదు..ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకి 100కోట్లకు పైగా లభాలను అందించి..ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్‌పూల్‌గా రన్ అవుతుంది.

హనుమాన్ మూవీలో హీరో తేజ సజ్జ తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా ప్రతీ ఎలిమెంట్ లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. దీంతో విమర్శకులు సైతం తేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక హనుమాన్ సూపర్ సక్సెస్ కావడంతో తేజతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే హనుమాన్ సినిమాతో  సూపర్ సక్సెస్ అందుకున్న తేజ.. తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేశారట. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు..తన తరువాతి సినిమా కోసం రూ.6 నుండి రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట.

  • Beta
Beta feature