హ్యాపీ బర్త్ డే ఆనంద్ మహీంద్రా.. ఆయన ఆస్తుల విలువెంతంటే

హ్యాపీ బర్త్ డే ఆనంద్ మహీంద్రా.. ఆయన ఆస్తుల విలువెంతంటే

బిలియనీర్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మే1న తన 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు, ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కోట్ల ఆస్తికి అధిపతి అయిన ఆనంద్ మహీంద్రా.. విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దేశంలోని ధనవంతుల్లో ఒకరైన ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసుకోవాలని చాలా మందికి కోరికగా ఉంటుంది.

ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి రియల్ ఎస్టేట్ వరకు విస్తరించి ఉన్న ఆనంద్ మహీంద్రా వ్యాపారం.. మొత్తం 22పరిశ్రమల్లో పెట్టుబడితో వ్యాపారాన్ని విస్తరింపజేశారు. ఫోర్బ్స్ లెక్క ప్రకారం, ఆనంద్ మహీంద్ర మొత్తం సంపద విలువ 2.1 బిలియన్ డాలర్లు. మన ఇండియన్ కరెన్సీ లో చెప్పాలంటే దీని విలువ దాదాపు రూ. 17వేల కోట్లు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఆనంద్ మహీంద్ర 1460వ స్థానంలో ఉన్నారు.    

ఆనంద్ మహీంద్రాకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనే ఎంతో విలాసవంతమైన భవనాలు, ఆస్తులు ఉన్నాయి. ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌లో విలాసవంతమైన భవనం ఉన్నట్టు సమాచారం. భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఇది ఒకటిగా కూడా చెప్పబడుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన, కళాత్మకమైన వస్తువులు, సామగ్రి, కళాఖండాలను ఈ భవనంలో అమర్చినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆయనకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దీన్ని వ్యాపారపరమైన, వ్యక్తిగత ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు.            

ఆస్తులే కాకుండా ఆనంద్ మహీంద్రా వద్ద ఎంతో ఖరీదు చేసే లగ్జరీ కార్లు, అత్యంత విలువైన అనేక పెయింటింగ్స్, శిల్పాలు ఆయన కలెక్షన్స్ లో ఉన్నాయి.