భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా జట్టుకు సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేని సెలక్టర్లను వెంటనే తొలగించాలని BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సూచించాడు. యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సిరీస్‌కోసం టీమిండియాకు ఎంపిక చేశారు. అయితే శాంసన్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాలేదు. అంతేకాదు వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల జట్టులో అతడు స్థానం కోల్పోయారు. ఏ ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకుండానే అతన్ని ఎలా అంచనా వేసి, ఏ ప్రాతిపదికన శాంసన్‌ను జట్టు నుంచి తొలగిస్తారని ఫైర్ అయ్యాడు హర్భజన్. ఏ మాత్రం ధైర్యంలేని ఇలాంటి సెలక్టర్లను తక్షణమే తొలగించాలన్నాడు.


