హరిణ వనస్థలి పార్క్ ఆగమవుతుంది.. మార్నింగ్ వాకర్స్ నిరసన ర్యాలీ

హరిణ వనస్థలి పార్క్ ఆగమవుతుంది.. మార్నింగ్ వాకర్స్ నిరసన ర్యాలీ

పొల్యూషన్ ఆరికట్టి.. ప్రకృతిని కాపాడాలని కోరుతూ.. సేవ్ హరిణ వనస్థలి పేరుతో ధాత్రి ఆర్ స్వచంద సంస్థ ఆధ్వర్యంలో 20 కాలనీల స్థానికులు, కాలేజ్ స్టూడెంట్స్ మార్నింగ్ వాకర్స్ నిరసన ర్యాలీ తీశారు. ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న వ్యర్థ జలాలు, కెమికల్ రసాయనాలు వనస్థలిపురంలోని హరిణ వనస్థలి ఫారెస్ట్ ని లోపలికి వెళ్తున్నాయని.. దీంతో పార్క్ లోకి వచ్చిన రసాయన వ్యర్థాలతో కూడిన వాటర్ తో సుమారు 10వేల చెట్లు ఎండిపోయాయని తెలిపారు.

స్ధానికంగా ఉన్న 20 కలనీలలో గ్రౌండ్  వాటర్ పోల్యుట్ అయ్యాయని.. ఘాటైన దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని... గత రెండేళ్లుగా ఈ సమస్యపై ధాత్రి స్వచంద సంస్థ పోరాటం చేస్తుందన్నారు. 

ఈ సందర్బంగా సంస్థ సభ్యులు స్థానికులు మాట్లాడుతూ.. మనుషులకే కాకుండా నేషనల్ పార్క్ లో ఉన్న మూగ జీవాలను కూడా ప్రమదాకరంగా మారిన ఈ దుశ్చర్యలను అధికారులు స్పందించాలని కోరారు. వేల చెట్లు ఎండిపోడమే కాకుండా గ్రౌండ్ వాటర్ పొల్యుట్ అయ్యి తాము రోగాల బారిన అడుతున్నామని చెప్పారు. ఇదే విషయంపై ఓ వైపు జీహెచ్ఎంసీ మరో వైపు ఫారెస్ట్, టీఎస్ ఐలా వారికి కూడా ఎన్నో సార్లు విన్నవించుకున్నా స్పదించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొల్యూషన్ బోర్డ్ వారికి కూడా ఎన్నో సార్లు ఫిర్యాదు చేసిన తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు శ్వాసకోశ వ్యాధులకు గురై ఎంతో మంది చనిపోయారని.. తమ ప్రాణాలు పోతున్నా అధికారులు అలాగే చూస్తూ ఉంటున్నారే తప్ప.. పట్టించుకోవడం లేదన్నారు.

ఫారెస్ట్ అధికారులు అయితే తమకు ఫారెస్ట్ కు ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెమికల్ వెస్టేజ్ నీరు తాగి వన్యప్రాణులు ఎన్నో మృతి చెందాయని అయిన ఫారెస్ట్ అధికారులకు పట్టింపు లేదన్నారు. పక్కనే ఉన్న ఆటోనగర్ నుంచి కెమికల్ వ్యర్దాలు డైరెక్టుగా ఫారెస్ట్ లోకి వచ్చి చెట్లను నాశనం చేస్తున్నాయని దీనిపై ఇప్పటికైనా పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.