- మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు లేఖ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్హరీశ్రావు ఆరోపించారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను పదే పదే ఆన్.. ఆఫ్ చేయొద్దన్నారు. మోటార్లను పాడు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. భారీ మోటార్లను ఇష్టమొచ్చినట్టు ఆన్.. ఆఫ్ చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు.
ఇలా చేస్తే వైబ్రేషన్స్వచ్చి పంపులు, ఇంపెల్లర్స్, షియర్పిన్స్, షాఫ్టులు, ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ పాడవుతాయని తెలిపారు. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లో మోటార్ల ఆపరేషన్ తీరు అభ్యంతరకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఈ విధానాన్ని మానుకోవాలని సూచించారు.
