హరివంశ్ నారాయణ్ సింగ్ హ్యాట్రిక్... రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా మూడోసారి ఎన్నిక... 

హరివంశ్ నారాయణ్ సింగ్ హ్యాట్రిక్... రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా మూడోసారి ఎన్నిక... 

రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే తరపున హరివంశ్ పేరును ప్రతిపాదించారు జేపీ నడ్డా, నిర్మలాసీతారామన్ వంటి కేంద్ర మంత్రులు. విపక్షాల నుంచి ఎవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో హరివంశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు రాజ్యసభ చైర్మెన్. హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా ఎన్నికవ్వడం ఇది వరుసగా మూడోసారి.

రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా ఎన్నికైన హరివంశ్ ను అభినందించారు మోడీ. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మోడీ. హరివంశ్ కు ఉన్న సుదీర్ఘ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. హరివంశ్ ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి జర్నలిజం, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. మూడోసారి ఈ పదవి చేపట్టడం అభినందనీయమని అన్నారు.

పెద్దల సభను హుందాగా, నిస్పక్షపాతంగా నడపటంలో ఆయనకు ఉన్న నేర్పు సభకు అలంకారమని అన్నారు. రాజ్యసభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా సహా ఇతర సభ్యులు హరివంశ్ నారాయణ్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు.