కాలుష్యం పెరిగిందా.. తగ్గిందా?

కాలుష్యం పెరిగిందా.. తగ్గిందా?

గణేష్, దుర్గమాతల నిమజ్జనం తరువాత ట్యాంక్ బండ్ కాలుష్యంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక మీద భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాలుష్యం పెరిగిందని ఒకసారి... వెంటనే తగ్గిందని మరోసారి అధికారులు చెబుతుండటంపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా...తూతూ మంత్రంగా నివేదికలు ఇచ్చి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటున్నారు. హైదరాబాద్ కు హుస్సేన్ సాగర్ సెంటార్ ఆఫ్ ఆట్రాక్షన్...టూరిస్టు ప్లేస్ గా మంచి పేరుంది. విదేశీయులు కూడా ఇక్కడకొచ్చి ట్యాంక్ బండ్ ను విజిట్ చేస్తుంటారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ ట్యాంక్ బండ్ కు పూర్వవైభవం తెస్తామని రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో సిఎం కేసీఆర్  ప్రకటించారు. కానీ ఇది ప్రకటనకే పరిమితమైంది.  సాగర్ ప్రక్షాళన అనేది ఏళ్ళ తరబడిగా కొనసాగుతూనే ఉంది. 

ట్యాంక్ బండ్ కు ఎంతటి పేరుందో ...పొల్యూషన్ కూడా అదే స్థాయిలో ఉంటోంది. హుస్సేన్ సాగర్ లో గత 30యేళ్ళుగా ప్రతీ ఏటా కాలుష్యం పెరుగుతుందే తప్ప... తగ్గిన సందర్భాల్లేవు. ప్రభుత్వాలు కూడా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయి. హుస్సేస్ సాగర్ పొల్యూషన్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చే నివేదికలు కూడా సరిగా ఉండట్లేదు. మొన్నటి గణేష్, దుర్గమాతల నిమజ్జనం సందర్భంగా PCB ఇచ్చిన నివేదికలు ఆ శాఖాధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయి. లేటెస్ట్ స్టడీలో హుస్సేన్ సాగర్ లో కాలుష్యం పెరిగిందని చెప్పారు. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ కు గుడ్ న్యూస్... పొల్యూషన్ తగ్గిందంటూ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.

హైదరాబాద్ మధ్యలో ఉన్న ఈ ట్యాంక్ బండ్ లోకి పారిశ్రామిక వాడలు, చుట్టు పక్కల ఉన్న హోటల్స్, ఇండ్ల నుంచి వచ్చే మురికి నీళ్లు వస్తాయి. ప్రతీ ఏటా కెమికల్ ఆక్సీజన్ డిమాండ్, బయాలిజికల్ ఆక్సీజన్ డిమాండ్ పెరిగిందా లేక తగ్గిందా అనే నివేదికలు మాత్రమే ఇస్తోంది. నీళ్ళ నమూనాలు సేకరించి స్పష్టమైన నివేదిక ఇవ్వడంలో అధికారుల విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాలుష్యంపై PCB నివేదికలు చూస్తే... అసలు సాంకేతికతతో ప్రయోగాలు చేస్తున్నారా లేదా నామ్ కే వాస్త్ గా రిపోర్టులు ఇస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా తప్పుడు నివేదికలు ఇవ్వకుండా టెక్నాలజీ పరంగా తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు పర్యావరణ నిపుణులు. పొల్యూషన్ నుంచి సిటీ జనాన్ని కాపాడాలంటే PCB అధికారుల నివేదికలే ప్రమాణికంగా ఉంటాయన్న గుర్తుపెట్టుకోవాలంటున్నారు.