గచ్చిబౌలి: ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత

గచ్చిబౌలి: ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత
  • గోపన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగు అంతస్థులు నేలమట్టం.. యజమానిపై కేసు 

గచ్చిబౌలి, వెలుగు: గోపన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రమాదకరంగా మారిన నాలుగు అంతస్థుల భవనాన్ని సైబరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ అధికారులు శనివారం బాహుబలి యంత్రం సహాయంతో పూర్తిగా నేలమట్టం చేశారు. తాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్లాట్​నంబర్​31/పి లో కేవలం 50 గజాల స్థలంలో విశ్వనాథపల్లి లక్ష్మి అనుమతులు లేకుండా నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. ఈ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మహమ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలకు రూ.60 వేలకు లీజుకు తీసుకొని ఇతరులకు అద్దెకు ఇస్తున్నాడు. తక్కువ స్థలంలో అక్రమంగా ఎక్కువ అంతస్థులు నిర్మించడంతో భవనానికి పగుళ్లు ఏర్పడి శుక్రవారం వెనక వైపు ఉన్న మరో భవనం వైపు పక్కకు ఒరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల నివాసితులను ఖాళీ చేయించారు. శనివారం ఉదయం భారీ బాహుబలి క్రేన్ సహాయంతో కూల్చివేత పనులు ప్రారంభించి, సాయంత్రానికల్లా భవనాన్ని పూర్తిగా తొలగించారు. ఈ కూల్చివేతల సమయంలో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయినా, పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఆఫీసర్లు పని పూర్తి చేయించారు. అనుమతులు లేకుండా ప్రమాదకరంగా భవన నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిన యజమాని లక్ష్మితోపాటు మరికొందరిపై శేరిలింగంపల్లి జోన్ ఏసీపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.