పనుందని తీసుకెళ్తడు.. రేప్ చేసి చంపేస్తడు

పనుందని తీసుకెళ్తడు.. రేప్ చేసి చంపేస్తడు
  • ఒంటిపై నగలు తీస్కొ ని డెడ్​బాడీని రోడ్డుపై పడేస్తడు
  • నాలుగు హత్యలు చేసిన కిల్లర్ ఎల్లప్ప అరెస్టు
  • సీసీటీవీ ఫుటేజీతో పట్టుకున్న బాలానగర్‌‌‌‌ పోలీసులు

కూలీల అడ్డా దగ్గరికొస్తడు. నగలున్న లేడీస్​ను చూస్తడు. వాళ్ల దగ్గర బేరం స్టార్ట్ చేస్తడు. ఇంట్లో పనుందని తీసుకెళ్తడు. మందు తాగించి రేప్ చేసి హత్య చేస్తడు. నగలను తీస్కొని డెడ్​బాడీని రోడ్డుపై పడేస్తడు. ఇప్పటివరకు ఇలా నాలుగు హత్యలు చేసిన కిల్లర్ ఎల్లప్పను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అడ్డా కూలీ మహిళలను టార్గెట్​చేస్తాడు. పని ఉందని చెప్పి తీసుకెళ్తాడు. మందు తాగించి రేప్ అండ్ మర్డర్ చేస్తాడు. ఒంటిపై నగలను తీసుకొని డెడ్​బాడీని రోడ్డుపై పడేస్తడు. సైబరాబాద్‌‌‌‌, వికారాబాద్‌‌‌‌లో ఇలా నాలుగు రేప్​అండ్ మర్డర్స్ చేసిన కిల్లర్ ఎల్లప్పను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఆ వివరాలను బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. మూడు చోరీ కేసుల్లోనూ అతడు వాంటెడ్ అఫెండరని చెప్పారు.

స్టోన్ కట్టర్ గా పని చేస్తూ..

కర్నాటకలోని గుల్బర్గ పోల్కంపల్లికి చెందిన కొడుదుల ఎల్లప్ప అలియాస్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ ‌‌‌‌(48) స్టోన్‌‌‌‌ కట్టర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. మేడ్చల్‌‌‌‌ జిల్లా హనుమాన్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. సైబరాబాద్‌‌‌‌, వికారాబాద్‌‌‌‌ జిల్లాలోని శివారు ప్రాంతాల్లో నేరాలకు స్కెచ్ వేశాడు. కూలీ అడ్డాల దగ్గర మహిళలను టార్గెట్‌‌‌‌ చేసేవాడు. ఇంట్లో పని పేరుతో తీసుకెళ్లి అత్యాచారం, హత్య, దోపిడీ చేసేవాడు. ఇలాగే ఈ నెల 17న మేడ్చల్‌‌‌‌ లేబర్‌‌‌‌‌‌‌‌ అడ్డాపై ఉన్న మెదక్‌‌‌‌ జిల్లా ఎల్దుర్తి రామంతపూర్ తండాకు చెందిన విజయ(22)ను రూమ్‌‌‌‌ క్లీనింగ్‌‌‌‌ పేరుతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ప్లాన్ ప్రకారం రెండు మందు బాటిళ్లు, కల్లు తీసుకొచ్చాడు. విజయకి కళ్లు తాగించాడు. తరువాత ఆమెపై అత్యాచారం చేసి ఒంటిపై ఉన్న బంగారం, వెండి లాక్కునేందుకు ట్రై చేశాడు. ఆమె అడ్డుకోవడంతో ముఖం, మెడ, ఛాతి భాగాల్లో బలంగా దాడి చేశాడు. హత్య చేశాడు.

రైల్వే గేట్‌‌‌‌ వద్ద విజయ డెడ్‌‌‌‌ బాడీ

విజయ ఒంటిపై ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడు, రూ.900 దొంగిలించాడు. అర్ధరాత్రి దాటాక ఆమె డెడ్‌‌‌‌బాడీని భుజాలపై వేసుకుని దగ్గర్లోని మేడ్చల్‌‌‌‌ రైల్వే గేట్‌‌‌‌ వద్ద ఉన్న రాళ్ల కుప్పలో పడేశాడు. డెడ్‌‌‌‌బాడీ కాళ్లకు ఉన్న వెండి పట్టీలను రాళ్లతో కట్‌‌‌‌ చేసి తీసుకున్నాడు. పని కోసం వెళ్లిన విజయ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి ముదావత్ పన్ని.. 18న మేడ్చల్‌‌‌‌ పోలీసులు కంప్లైంట్‌‌‌‌ ఇచ్చారు. కేసు రిజిస్టర్‌‌‌‌ చేసుకొని పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో మేడ్చల్‌‌‌‌ రైల్వే గేట్‌‌‌‌ రాళ్లలో విజయ డెడ్‌‌‌‌ బాడీని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ, ఇంటి ఓనర్ వివరాల ఆధారంగా ఎల్లప్పను బాలానగర్‌‌‌‌ ఎస్ వోటీ పోలీసులు గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు.

పీడీ యాక్ట్ పెడ్తం: డీసీపీ

నిందితుడు ఎల్లప్ప లేబర్‌‌‌‌ అడ్డాలనే టార్గెట్‌‌‌‌ చేసి వరుస నేరాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మాదాపూర్‌‌‌‌‌‌‌‌, వికారాబాద్‌‌‌‌ జిల్లా పెద్దములలో ఇలాంటివే మూడు రేప్‌‌‌‌ అండ్‌‌‌‌ మర్డర్స్‌‌‌‌ చేసినట్లు ఆధారాలు సేకరించారు. సనత్​నగర్‌‌‌‌‌‌‌‌, కూకట్‌‌‌‌పల్లి, రాయదుర్గం పీఎస్‌‌‌‌ లిమిట్స్‌‌‌‌లో చోరీలు చేసి జైలుకొచ్చినట్లు గుర్తించారు. ఏడు కేసుల్లో నిందితుడైన ఎల్లప్పపై పీడీ యాక్ట్‌‌‌‌ పెట్టి జైల్లో నిర్బంధిస్తామని డీసీపీ పద్మజ తెలిపారు.