నల్లని ఎండు ద్రాక్ష తినడం వల్ల ప్రయోజనాలు

 నల్లని ఎండు ద్రాక్ష తినడం వల్ల ప్రయోజనాలు

చలికాలంలో స్నాక్​గా నల్లని ఎండు ద్రాక్ష తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. కేకులు, ఖీర్​, బర్ఫీలలో  కలిపి తినొచ్చు కూడా. బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్​, బీపీని కంట్రోల్​లో ఉంచడానికి ఈ డ్రై ఫ్రూట్స్ సాయపడతాయి. వీటితో మరిన్ని  లాభాలు కూడా ఉన్నాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. అవేంటంటే...

  • నల్లని ఎండు ద్రాక్ష తింటే ఆస్టియోపొరోసిస్​ సమస్య రాకుండా జాగ్రత్తపడొచ్చు.  
  • ఈ సీజన్​లో జుట్టు పొడిగా ఉంటుంది. వెంట్రుకల కొసలు చిట్లిపోతుంటాయి కూడా. ఈ సమస్య తగ్గాలంటే రోజూ కొన్ని నల్లని ఎండు ద్రాక్షలు తినాలి. వీటిలోని ఐరన్​, విటమిన్​–సి జుట్టుకి పోషకాలు అందేలా చేస్తుంది. దాంతో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • వీటిలోని ఐరన్​ హిమోగ్లోబిన్​ శాతాన్ని పెంచి, ఎనీమియా బారిన పడకుండా కాపాడుతుంది. 
  • రోజూ కొన్ని నల్లని ఎండు ద్రాక్ష తింటే, నెలసరి నొప్పులు తగ్గిపోతాయి. చెడు కొలెస్ట్రాల్​ కూడా తగ్గుతుంది. వీటిలోని ఫైటోకెమికల్స్​ నోటిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నోటి దుర్వాసన పోగొడతాయి కూడా.