హెల్త్‌‌ ఫైల్స్‌‌ మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌లో అవినీతిని బయటపెడ్తా: బాబురావు 

హెల్త్‌‌ ఫైల్స్‌‌ మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌లో అవినీతిని బయటపెడ్తా: బాబురావు 

హైదరాబాద్, వెలుగు: మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్‌‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై తెలంగాణ హెల్త్ ఫైల్స్ పేరిట డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తానని ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌, ప్రొఫెసర్ బాబురావు ప్రకటించారు. జూన్‌‌ 2న విడుదలయ్యే ఈ డాక్యుమెంటరీలో ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌లో జరిగిన అన్ని అంశాలు ఉంటాయని తెలిపారు. మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ ప్రమోషన్లు, పోస్టింగుల్లో జరుగుతున్న వివాదాలను బయటపెడతానని వెల్లడించారు.

ఆరోగ్య శాఖ మంత్రుల బర్తరఫ్ వెనుక ఉన్న అసలు కథనం కూడా ఇందులో ఉంటుందని చెప్పారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుందో, లేదో ఈ డాక్యుమెంటరీతో తేలుతుందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రజల కోసమా, కాంట్రాక్టర్ల కోసమా అనేది కూడా తేలుస్తామన్నారు. ప్రభుత్వ దవాఖాన్ల కోసం కొనుగోలు చేస్తున్న మందుల్లో నాణ్యత, అవి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయా? లేదా? అన్నది కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.