హైదరాబాద్‌లో థియేటర్‌‌లోకి భారీగా వరద నీరు

హైదరాబాద్‌లో థియేటర్‌‌లోకి భారీగా వరద నీరు

హైదరాబాద్ : భారీ వర్షాలకు హైదరాబాద్ ఆగం అయ్యింది. రోడ్లన్నీ జలమయం కాగా..చెట్లు విరిగిపడ్డాయి. నాలాలు పొంగిపొర్లడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి సరూర్ నగర్ శివగంగ థియేటర్లో పార్కింగ్‌ లో పెట్టిన వాహనాలపై గోడ కూలింది. థియోటర్‌ లోనికి వరద ప్రవహించడంతో ప్రహరీ గోడ కూలడంతో 50కి పైగా టూవీలర్స్ ధ్వంసమయ్యాయి. టూవీలర్లు నుజ్జునుజ్జ కావడంతో వెహికిల్స్ ఓనర్లు ఆందోళన చేస్తున్నారు. భారీ వరద నీరు చేరడంతో శివ గంగా థియేటర్ పూర్తిగా నీటమునిగింది. శుక్రవారం సాయంత్రం ఫస్ట్ షో సినిమా చూస్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు వెహికిల్స్ ఓనర్లు. వాహనాలపై గోడ కూలిన ఘటనపై థియేటర్ యాజమాన్యం ఇప్పటికీ స్పందించలేదని వాపోయారు. వాహనాలు లేకపోవడంతో ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.