కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు: రెండు జిల్లాల్లో రెడ్ అలర్డ్

కేరళను వణికిస్తున్న భారీ వర్షాలు: రెండు జిల్లాల్లో రెడ్ అలర్డ్

కేరళను  భారీ వర్షాలు  వణికిస్తున్నాయి. వారం రోజులుగా  కురుస్తున్న వానలతో జనజీవనం  అస్తవ్యస్తం  అవుతోంది. అయితే  కన్నూరు, కసరగడ్  జిల్లాలకు  రెడ్ అలర్ట్  ప్రకటించింది  వాతావరణ శాఖ. మరోవైపు  కోజికోడ్,  మలపురం, వైనాడ్  జిల్లాలకు  ఆరెంజ్ అలర్ట్…. పాలకడ్,  ఎర్నాకులం,  ఇడుక్కి  జిల్లాలకు ఎల్లో అలర్ట్  కొనసాగుతుందని  తెలిపారు అధికారులు.  కన్నూరు,  కసరగడ్, మలపురం  జిల్లాలకు  భారీ వర్ష  సూచన  ఉండటంతో….ఇవాళ  స్కూల్స్ కు సెలవు  ప్రకటించింది  సర్కార్.  మరోవైపు  వాతావరణ శాఖ  అలర్ట్ తో  ముందస్తు చర్యలు  చేపట్టింది  కేరళ సర్కార్.