కాఠ్మాండ్: నేపాల్ పర్యాటక, పౌర విమానయాన శాఖ మంత్రి రవీంద్ర అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తప్లెజంగ్ ప్రాంతంలోని పతిభర ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. మంత్రితో పాటు హెలికాప్టర్ కెప్టెన్ ప్రభాకర్ కేసీ, టూరిజం ఎంట్రిపెన్యూర్ ఆంగ్ చిరింగ్ షెర్పా, భద్రతాధికారి అర్జున్ ఘిమిర్ సహా మరో ముగ్గురు హెలికాప్టర్ లో ఉన్నారు.
తప్లెజంగ్ జిల్లా కలెక్టర్ అనుజ్ భండారి, ఇతర అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పతిభర ఆలయ సందర్శనతోపాటు చుహాన్ దండాలో నిర్మాణంలో ఉన్న ఎయిర్ పోర్టు పరిశీలన కోసం వారు వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
హైలికాప్టర్ క్రాష్ పై ప్రధాన మంత్రి కార్యాలయం, కేబినెట్ అత్యవసర సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
