
బషీర్‌బాగ్, వెలుగు: హెరాయిన్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ బృందానికి చిక్కాడు. డీటీఎఫ్ సీఐ సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ కు చెందిన గుజ్జర్ రాజస్థాన్‌లో గ్రాము హెరాయిన్‌ను రూ.5 వేల చొప్పున కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో రూ.15 వేలకు విక్రయిస్తున్నాడు.
పక్కా సమాచారంతో డీటీఎఫ్సిబ్బంది సోమవారం అతన్ని కోఠి బగ్గా వైన్స్సమీపంలో పట్టుకున్నారు. తనిఖీ చేయగా 17 గ్రాముల హెరాయిన్లభ్యమైంది.
నిందితుడిని నారాయణగూడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. డీటీఎఫ్ బృందాన్ని డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి అభినందించారు.