ముషీరాబాద్, వెలుగు: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ హ్యాండ్లూమ్ వాక్ నిర్వహిస్తున్నట్లు చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు తెలిపారు. చిక్కడపల్లిలోని చైతన్య వేదిక కార్యాలయంలో ఆదివారం వాక్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
భారతీయ చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి హాజరై, చేనేత కళాకారులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బండారి లక్ష్మి, కార్యదర్శి కొండ బత్తిని కృష్ణ సంతోషి, వై.శ్రీదేవి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు
