
అరవయ్యొక్కేళ్ల వయసులోనూ ఒకేసారి ఆరు సినిమాలకి వర్క్ చేస్తూ యంగ్ హీరోలను ఇన్‌స్పైర్ చేస్తున్నారు మోహన్‌లాల్. వాటిలో ఒకదానికి డైరెక్షన్ కూడా చేయడం విశేషం. ‘బారోజ్’ అనే ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ కోసం మెగాఫోన్ పట్టారు మోహన్‌లాల్. పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలయ్యింది. అయితే మోహన్‌లాల్‌కి ఉన్న కమిట్మెంట్స్తో పాటు కొవిడ్ తీవ్రత మరోసారి పెరగడంతో బ్రేక్ పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో తిరిగి షూట్‌ను స్టార్ట్ చేసినట్లు టీమ్ కన్‌ఫర్మ్ చేసింది. డైరెక్టర్‌గా, లీడ్ యాక్టర్‌గా చకచకా వర్క్ చేస్తూ సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరిలో మోహన్‌లాల్ ఎనర్జీని నింపుతున్నారని యూనిట్ సభ్యులు అంటున్నారు. మరోవైపు టిను పప్పచ్చాన్ డైరెక్షన్‌లో కూడా నటించడానికి రెడీ అవుతున్నారట లాల్. ఇక త్వరలో మొదలు కానున్న మలయాళ బిగ్‌బాస్ కొత్త సీజన్‌కి కూడా ఎప్పటిలా హోస్ట్‌గా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నారు.