ఇది  బిగ్గెస్ట్  రివార్డ్‌‌‌‌‌‌‌‌

ఇది  బిగ్గెస్ట్  రివార్డ్‌‌‌‌‌‌‌‌

నాని హీరోగా సాయిపల్లవి, కృతీశెట్టి హీరోయిన్లుగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నాని మాట్లాడుతూ ‘కష్టమైన ఏడాదికి ఇలాంటి క్లాసిక్ కమర్షియల్ సక్సెస్‌‌‌‌‌‌‌‌తో ముగింపు పలకడం హ్యాపీ. సినిమా బాగుందని ఒకట్రెండు పదాలతో చెప్పకుండా లవ్ లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా రాస్తున్నారు. అది బిగ్గెస్ట్ రివార్డ్‌‌‌‌‌‌‌‌గా ఫీలవుతున్నాను. చాలా లవ్ స్టోరీస్ చేశాను కానీ ఫరెవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీలింగ్ తెచ్చిపెట్టిందీ సినిమా. క్రిస్మస్‌‌‌‌‌‌‌‌తో పాటు రాబోయే న్యూ ఇయర్ కూడా మనదే ’ అన్నాడు. ‘థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో ఆడియెన్స్ ఎంజాయ్ చేయడం దగ్గర్నుంచి చూశాను. ఒక్కొక్కరూ మూడు నాలుగుసార్లు చూశామని చెప్పడం చాలా హ్యాపీ. నన్ను రోజీగా గుర్తు పెట్టుకున్నందుకు థ్యాంక్స్’ అంది సాయి పల్లవి. రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందంది కృతి. రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ ‘ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌ మమ్మల్ని ఎప్పుడూ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తుంటారు.

ఇప్పుడు కూడా నారాయణ మూర్తిగారిని తీసుకొచ్చి సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశారు. నాకెంతో ఇష్టమైన వ్యక్తుల్లో ఆయనొకరు. నమ్మిన విలువలకు కట్టుబడి ఉండే నిజమైన మనిషి. ఇంకా చెప్పాలంటే మా శ్యామ్‌‌‌‌‌‌‌‌ సింగరాయ్‌‌‌‌‌‌‌‌ లాంటి మనిషి. ఈ సినిమా కోసం వర్క్ చేసిన వారందరికీ థ్యాంక్స్. ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నాడు. సినిమా సక్సెస్‌‌‌‌‌‌‌‌కి కారణమైన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు నిర్మాత. దిల్‌‌‌‌‌‌‌‌ రాజు, ఆర్.నారాయణమూర్తి, అభినవ్ గోమటం, రైటర్ జంగా సత్యదేవ్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా పాల్గొన్నారు.