అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలి: ఎంపీ మిథున్ రెడ్డి 

అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలి: ఎంపీ మిథున్ రెడ్డి 

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది ఎన్డీయే సర్కార్. బుధవారం ( ఏప్రిల్ 1 ) సభలో ప్రవేశపెట్టిన అమరావతికి చట్టబద్దత బిల్లుపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అమరావతికి మేము వ్యతిరేకం కాదని.. కానీ ఈ తరహాలో బిల్లు సరికాదని అన్నారు. అమరావతి ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారన్నది బిల్లులో లేదని.. ఎప్పటిలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేస్తారో స్పష్టత లేదని అన్నారు మిథున్ రెడ్డి. అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలని.. లేదంటే బిల్లుకు అర్థమే ఉండదని అన్నారు మిథున్ రెడ్డి.

రాజధాని అన్నది రాష్ట్ర నిర్ణయమని గతంలో హైకోర్టుకు కేంద్రం అఫిడవిట్ కూడా ఇచ్చిందని అన్నారు మిథున్ రెడ్డి. అమరావతి బిల్లుపై మాట్లాడిన కూటమి సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం మీద కూడా మాట్లాడి ఉంటె బాగుండేదని అన్నారు మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అమరావతిపై ఇప్పటివరకు రూ. 5వేల కోట్లే ఖర్చు చేసిందని అన్నారు మిథున్ రెడ్డి. ఇప్పటివరకు అమరావతి రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వలేదని అన్నారు.

►ALSO READ | లోక్ సభలో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

అమరావతి కోసం ఇప్పటికే 54 వేల ఎకరాలు సేకరించారని..రాజధాని కోసం మరింత భూమి తీసుకోవాల్సిన అవసరం ఏముందని అన్నారు మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతుల గురించి పట్టింపు లేదని అన్నారు.అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలని..లేదంటే బిల్లుకు అర్థమే ఉండదని అన్నారు మిథున్ రెడ్డి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు