నన్ను నేను నమ్మలేకపోయా  : రవితేజ

నన్ను నేను నమ్మలేకపోయా  :  రవితేజ

‘ఈగల్‌‌’ చిత్రంలో తన పాత్ర మేకోవర్‌‌‌‌కు చాలా ప్రశంసలు వస్తున్నాయి అని చెప్పారు రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా రీసెంట్‌‌గా విడుదలై పాజిటివ్ టాక్‌‌ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌‌లో రవితేజ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్‌‌కు ఆనందంగా ఉంది. నా మేకోవర్‌‌‌‌ బాగుందని చెప్పడం హ్యాపీ. కాళికాదేవి ఎపిసోడ్‌లో అయితే నన్ను నేను నమ్మలేకపోయా.

ఎవరినో చూస్తున్న అనుభూతి కలిగింది. కార్తీక్ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్‌‌‌‌కి  ఎక్సయిట్ అయ్యా. ఎంతో విజన్ ఉన్న కార్తీక్ త్వరలో టాప్ డైరెక్టర్ అవుతాడు. ఇక ధమాకా, ఈగల్ తర్వాత హరీష్ శంకర్‌‌‌‌తో వచ్చే ‘మిస్టర్ బచ్చన్‌‌’తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌లో హ్యాట్రిక్ కొడుతున్నాం’ అని  చెప్పారు. ఈ సక్సెస్‌‌లో భాగమవడం సంతోషంగా ఉందని కావ్య థాపర్ చెప్పింది. కార్తీక్ మాట్లాడుతూ ‘ఈ  చిత్రానికి ప్రేక్షకుల మనసుల నుంచి వచ్చిన స్పందన చాలా టచ్చింగ్‌‌గా అనిపించింది.

యాక్షన్ సినిమాకి మంచి మీనింగ్ యాడ్ చేసి తీయడం రవితేజ గారు లాంటి స్టార్ వలనే సాధ్యపడింది’ అని  అన్నాడు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల. కార్యక్రమానికి హాజరైన హరీష్ శంకర్‌‌ టీమ్‌‌కు కంగ్రాట్స్ చెప్పారు. శ్రీనివాస్ అవసరాల, మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాండ్ పాల్గొన్నారు.