సింగం 4కి రంగం సిద్ధం.. ఈసారి పాన్ వరల్డ్

సింగం 4కి రంగం సిద్ధం.. ఈసారి పాన్ వరల్డ్

తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ అంటే సింగం సిరీస్ అనే చెప్పాలి. మాస్ డైరెక్టర్ హరి తెరకెక్కించిన ఈ సిరీస్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు సూర్య. ఈ మూడు సినిమాలు  తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ సిరీస్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఈ సినిమాల్లో సూర్య యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లేవల్లో ఉంటాయి. అందుకే అంతలా ఈ సినిమాలు ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.

ఇక సింగం 3 రిలీజ్ సమయంలోనే సింగం 4 కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్. అప్పటినుండి ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నిజానికి సూర్యని సింగం లాంటి మాస్ క్యారెక్టర్ లో చూసి కూడా చాలాకాలం అయ్యింది. అందుకే సింగం 4 సీక్వెల్ త్వరగా స్టార్ట్ చేయాలంటూ డైరెక్టర్ హరిని సూర్య  ఫ్యాన్స్ సోషల్ మీడియా వేధికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే..  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. సింగం 4 త్వరలో మొదలుకానుందట. ప్రస్తుతం.. సూర్య డైరెక్టర్ శివతో కంగువ అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ కానుంది.

మరోపక్క డైరెక్టర్ హరి కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ దర్శకుడు ఈ మధ్యే హీరో విశాల్ తో ఒక సినిమాని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తైన వెంటనే.. సింగం 4 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నాడు హరి. ఈ వార్త తెలుసుకున్న సూర్య మరియు  సింగం సిరీస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఈ మూడు సిరీస్ లలో హీరోయిన్ గా నటించిన అనుష్కనే నాలుగో సీక్వెల్ లో కూడా నటించనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సింగం 4తో రానున్న సూర్య ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్నాడో చూడాలి.