“హీరోలు తయారవుతారు.. పుట్టరు..” : మెగాస్టార్ ట్వీట్

“హీరోలు తయారవుతారు.. పుట్టరు..” : మెగాస్టార్ ట్వీట్

ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ లాక్‌డౌన్ కాలంలో వ‌ల‌స కార్మికులకు సాయం చేసిన అనుభ‌వాల‌ను గుర్తు చేస్తూ…  పెంగ్విన్ ర్యాండ్ హౌజ్ ఇండియా ఆటోబ‌యోగ్ర‌ఫీ (సోనూసూద్‌ ఆత్మ‌క‌థ)‌ ‘ఐ యామ్ నో మెస్సీయ’‌ పుస్త‌కం రాసిన విష‌యం తెలిసిందే.  ప్ర‌స్తుతం ఆచార్య షూటింగ్‌లో ఉన్న సోనూసూద్ సెట్స్ లో ఈ పుస్త‌కాన్ని చిరంజీవికి అంద‌జేశాడు. ఈ సందర్భంగా సోనుపై తనకున్న అభిమానాన్ని చిరు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. “హీరోలు త‌యార‌వుతారు..పుట్ట‌ర‌ని మీ పుస్త‌కంతో మ‌రోసారి నిరూపించారు. ఎన్నో వేల మందిని ఆదుకుని, ఎంతో ఎత్తుకు ఎదిగావు. నీ ప్ర‌యాణం కోట్లాదిమందికి స్పూర్తిని క‌లిగించే విష‌య‌మని” ట్వీట్ చేశారు చిరు. సోనూసూద్ సేవ‌ల‌ను గుర్తు చేస్తూ పుస్త‌కం రావ‌డంతో చిరు కంగ్రాట్స్ చెప్పారు.   Congratulations @Sonusood on your book #IamNoMessiah You proved yet again that Heroes are made, Not born. You truly rose to the occasion & helped thousands.Your journey will surely inspire. #IAmNoMessiah in English https://t.co/0ezggmQiLe and Hindi https://t.co/KNhVd7FnJF pic.twitter.com/zRsQSSM16y — Chiranjeevi Konidela (@KChiruTweets) December 30, 2020