- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఆధార్ కార్డు లేని కారణంగా అంబులెన్స్ సేవలు అందించలేదనే అభియోగాల ప్రజాహిత వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల వాదనలు వింటామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎస్సీ బుడగ జంగాల వర్గానికి చెందిన ఒక బాలిక వద్ద ఆధార్ కార్డు లేని కారణంగా అంబులెన్స్ సేవలు అందజేయలేదంటూ పారా లీగల్ వాలంటీర్ కె. రాజు వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
